హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(RS Working President KTR) నందినగర్ ఇంటి బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీస్‌కు బయల్దేరారు. ఫార్ములా-ఈ రేస్ కేసు(Formula-E race case)లో కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. విదేశీ సంస్థల నిధుల బదిలీ, నిబంధనల ఉల్లంఘనలపై విచారించనున్నారు. ఏసీబీ ప్రధాన కార్యాలయం(Anti Corruption Bureau) వద్ద పోలీసులు మోహరించారు. ఏసీబీ కార్యాలయం ముందు కేటీఆర్(KTR) వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. న్యాయవాదులు ఎవరు కూడా కేటీఆర్ వెంట వెళ్ళకూడదు అంటూ పోలీసులు వాహనాన్ని ఆపారు. చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఉన్నతన హక్కులను వినియోగించుకోనివ్వాలని కేటీఆర్ పోలీసులను కోరారు.