03-04-2025 11:38:54 PM
అన్ని కోణాలలో కేసు దర్యాప్తు..
మహేశ్వరం (విజయక్రాంతి): జర్మనీ యువతి అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తును వేగం పెంచారు. లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. 2018లో ఓ పోక్స్ కేసులో అస్లాంను పోలీసులు అరెస్ట్ చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే నిందితుడు మొహమ్మద్ అబ్దుల్ అస్లాంను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు నిందితుడిని కస్టడీ కోసం కోర్టులో ఫిటిషన్ దాఖాలు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుడిని కస్టడికి తీసుకుంటే కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు.
జర్మనీ తిరిగి వెళ్లిన బాధితురాలు..
ఇండియాలో టూరిస్ట్‌గా నెల రోజుల పాటు వివిధ ప్రదేశాలను తిలకించి ఇక్కడి సాంప్రదాయాలను.. సాంస్కృతులను మదిలో దాచుకున్న జర్మనీ యువతి దురదృష్టావశాత్తు అత్యాచారానికి గురైంది. అయితే ఆమె ఈ నెల 3వ తేదీన గురువారం తిరిగి జర్మనీ వెళ్లాల్సి ఉండటంతో పోలీసులు మెజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అనంతరం జర్మనీ కన్సులేట్‌కు రిపోర్టు చేశారు. బాధితురాలు జర్మనీలో ఉన్నప్పటికీ అవసరమైనప్పుడు ఆమెను సంప్రదిస్తామని పోలీసులు పేర్కొన్నారు. అన్ని వివరాలు సేకరించి చట్టాపరంగా యువతికి న్యాయం జరిగేలా చూస్తామని పహాడి షరీఫ్ ఇన్స్‌స్పెక్టర్ గురువరెడ్డి తెలిపారు.