calender_icon.png 21 January, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్ ప్రారంభం

21-01-2025 12:32:53 AM

ముఖ్య అతిథులుగా హాజరైన సైనా, కశ్యప్

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20 (విజయక్రాంతి): హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ పోటీలు సోమవారం గోషామహాల్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ జెండా ఎగురవేసి పోటీలను ప్రారంభించారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పర్యవేక్షణలో మూడు రోజుల పాటు గేమ్స్ జరగనున్నాయి.

క్రీడల్లో అన్ని గేమ్స్ తనకు ఇష్టమని.. దేశం తరుఫున ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఫీలయ్యానని సైనా పేర్కొంది. వార్షిక స్పోర్ట్స్, గేమ్స్ మీట్‌లో 14 జట్లు పాల్గొనడం ఇదే తొలిసారని సీవీ ఆనంద్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు సీపీలు విక్రమ్‌సింగ్, విశ్వప్రసాద్, డీసీపీ రక్షితా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.