బెల్లంపల్లి (విజయక్రాంతి): పోలీసులు తమకు అప్పగించిన విధులను అంకిత భావంతో నిర్వర్తించి ప్రజల్లో మంచి గుర్తింపు పొందాలని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ సూచించారు. ఇటీవల పోలీసు శిక్షణ పూర్తి చేసుకుని బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు కేటాయించబడ్డ నూతన కానిస్టేబుళ్లను ఆయన ఆదివారం బెల్లంపల్లి రూరల్ సిఐ కార్యాలయంలో పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేశారు. శాంతి భద్రతల నిర్వహణలో తమదైన పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐలు అఫ్జలుద్దీన్, దేవయ్య, ఎస్సైలు మహేందర్, రమేష్, ప్రసాద్ లు పాల్గొన్నారు.