calender_icon.png 5 October, 2024 | 12:53 PM

పోలీసులు కాంగ్రెస్ నేతలకు భక్తులుగా మారొద్దు

05-10-2024 12:30:39 AM

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

హైదరాబాద్, అక్టోబర్ 4(విజయక్రాంతి): రాష్ర్టంలో కొందరు పోలీ సులు బీఆర్‌ఎస్ కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ అక్రమ కేసు లు బనాయిస్తున్నారని, కాంగ్రెస్ భక్తులుగా మారి అత్యుత్సాహం ప్రదర్శిం చొద్దని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ న్ హెచ్చరించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో సోమ భరత్‌కుమార్, గట్టు రాంచందర్‌రావు, జక్కు ల లక్ష్మణ్‌తో కలిసి ఆయన మీడియా తో మాట్లాడారు.

ఖమ్మంలో హరీశ్‌రావు, హైదరాబాద్‌లో కేటీఆర్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఎన్నికల సమయంలో తన విశాక కంపెనీ నుంచి రూ.8 కోట్ల అక్రమంగా బదిలీ చేశారని ఆరోపించారు.

ఆ సమయంలో తాను ఎన్నిక ల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. సీఎం రేవంత్‌రెడ్డి వద్దే హోం శాఖ ఉండటంతో వివేక్‌ను కాపాడే ప్రయ త్నం చేస్తున్నారని విమర్శించారు. జర్నలిస్టులపై దాడులు పెరిగిపోయాయని, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం సరికాదన్నారు.