calender_icon.png 13 February, 2025 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థ ఎన్నికల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి

13-02-2025 12:00:00 AM

  • గత ఎన్నికలలో అల్లర్లు సృష్టించిన వారిని  ముందస్తుగా బైండోవర్ చేయాలి
  • ప్రతి గ్రామాన్ని సందర్శించి, ఎన్నికలలో  గ్రామ పరిస్థితులను తెలుసుకోవాలి
  • ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక ప్రణాళిక  చేసుకోవాలి 
  • ఎస్పీ చెన్నూరి రూపేష్

సంగారెడ్డి, ఫిబ్రవరి 12 (విజయ క్రాంతి):  స్థానిక సంస్థల ఎన్నికలు  ప్రశాంతంగా నిర్వహించేందుకు యస్.హెచ్.ఓ.లు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవాలి, ప్రతి గ్రామాన్ని ప్రత్యేకంగా సందర్శించి, అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలని ఎస్పీ చెన్నూరు రూపేష్ తెలిపారు. బుధవారం సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికలలో అల్లర్లు సృష్టించిన వారిని సత్: ప్రవర్తన కోరుతూ ముందస్తుగా బైండోవర్ చేయాలని సూచించారు.

ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, పోలింగ్ రోజు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండవలసిన కనీస వసతులను చూసుకోవాలని అన్నారు. ఎన్నికల దృష్ట్యా డబ్బు, మద్యం, క్రికెట్ కిట్ల పంపిణీ తో పాటు అక్రమ రవాణా చేయకుండా జిల్లా వ్యాప్తంగా, సరిహద్దు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, ముమ్మర తనిఖీలు చేయాలని సూచించారు. ప్రజలెవరైన ఇతర పార్టీలను గాని, వ్యక్తులను గాని కించపరిచే విధంగా వ్యాక్యలు చేయరాదని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టరాదని సూచించారు.

వరైనా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంగించి, ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తులపై, వాట్సప్ గ్రూప్ లలో ఫార్వర్డ్ మెసేజ్ పెట్టిన గ్రూప్ అడ్మిన్ లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 

అధికారులు, సిబ్బంది జిల్లా ప్రజలతో సత్: సంబంధాలు కలిగి, ఎలాంటి శాంతి భధ్రతల సమస్యలు తలెత్తకుండా సమాచారాన్ని సేకరించాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కృషి చేయాలని అన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది 24*7 హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలన్నారు .జిల్లా కేంద్రం నుండి ఎలాంటి సమాచారని అడిగిన త్వరితగతిన స్పందించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు , డీఎస్పీ లు, సీఐలు, ఎస్త్స్ర లు పాల్గొన్నారు.