06-04-2025 10:37:40 PM
డిఎస్పీ పార్థసారథి..
పెన్ పహాడ్: సమాజ భద్రత లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ యంత్రాంగం మానసిక బాధ, ఇబ్బందులతో న్యాయం కోసం వచ్చిన ఫిర్యాదుదారులకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ ఫ్రెండ్లీ పోలీసుగా వ్యవరించాలని డీఎస్పీ పార్థసారథి కోరారు. ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను పరిశీలించారు. ఎండాకాలం సమీపించినందున గ్రామాలలో ఆరుబయట నిద్రిస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దొంగల బెడద, చైన్ స్నాచర్స్ తిరుగుతున్నందున సిబ్బంది ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహించాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదులను, పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే ఎంతటి వారిపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట సీఐ రాజశేఖర్, స్థానిక ఎస్ఐ గోపికృష్ణ, ఏఎస్ఐ రాములు, హెడ్ కానిస్టేబుల్ యాదగిరి, సిబ్బంది ఉన్నారు.