25-03-2025 01:34:19 AM
జిల్లా ఎస్పీ టీ శ్రీనివాసరావు
గద్వాల, మార్చి 24 ( విజయక్రాంతి ) : ప్రజలకు పోలీస్ అధికారులు, సిబ్బంది జవాబుదారీగా ఉంటూ బాధ్యతా తో పనిచేయాలని జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన 10 మంది ఆర్జీ దారుల నుంచి డి .ఎస్పి మోగిలయ్య, గద్వాల్ ,ఆలంపూర్ మరియు శాంతినగర్ సర్కిల్ అధికారుల సమక్షంలో ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత అధికారులతో పోలీస్ స్టేషన్ ఎస్త్స్ర లతో ఫోన్లో మాట్లాడి, సమస్యల పూర్తి వివరాలను సమర్పించాలని, ప్రతి కేసుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు సమస్యలతో పోలీసు స్టేషన్ వచ్చినప్పుడు తక్షణమే స్పందించి, జవాబుదారీ గా ఉంటూ న్యాయం జరిగేలా చేసినప్పుడే పోలీసులపై నమ్మకం కలుగుతుందని అన్నారు. బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.