calender_icon.png 15 April, 2025 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిర్యాదుదారుల పట్ల పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలి

12-04-2025 09:59:56 PM

ఎల్లారెడ్డి, తాడ్వాయి పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ..

కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, తాడ్వాయి పోలీస్ స్టేషన్లు ను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తాడ్వాయి పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బంది జిల్లా ఎస్పీకి పూలమొక్క అందజేసి ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు సిఐలు సంతోష్ కుమార్, రవీంద్ర నాయక్, ఎస్సైలు ఎస్పీకి స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మొదటిసారిగా రావడంతో తాడువాయి, ఎల్లారెడ్డి, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ నందు పిర్యాదుదారులతో ప్రవర్తించవలసిన తీరును సిబ్బందితో మాట్లాడి వివరించారు. బాధితుల పట్ల, ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరించి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలిపారు.

పోలీస్ స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలని తెలియజేశారు. నేరాల నియంత్రణ కోసం పెట్రోలింగ్ గస్తీ నిర్వహిస్తూ, అనుమానితులను పరిశీలిస్తూ ఉండాలని తెలిపారు. ఎల్లారెడ్డిలో హనుమాన్ జయంతి ర్యాలీ ఉండడముతో ర్యాలీ నిర్వహించు రూట్ గురించి తెలుసుకొని తగు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ లో సిసి కేమెరాలను పరిశీలించి ఇంకా ఎక్కువ మొత్తం లో కేమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర నాయక్, సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్, ఎల్లారెడ్డి ఎస్సై మహేష్, తాడ్వాయి ఎఎస్సై కొండల్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.