13-03-2025 01:38:28 AM
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
జైనూర్, మార్చి 12 : ప్రజల రక్షణ కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఎస్పీ డివి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జైనూర్ మండల కేంద్రంలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ప్రతిమ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆదివాసి ప్రాంతాలలో మెరుగైన వైద్యసదుపాయం సుదూరంగా ఉండడంతో పేదవారికి వైద్యం అందుబాటులోకి తేవాలని ఉద్దేశంతో వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ప్రతిమ హాస్పిటల్ వైద్యులు కౌశిక్, గీతారెడ్డి, అవినాష్ కుమార్, విశ్వంత్, శ్రావణ్ కుమార్,రవీణ, రోషన్ రాజ్ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్, సీఐ రమేష్, సింగిల్ విండో చైర్మన్ అను పటేల్, ఎస్‌బిసిఐ రానా ప్రతాప్, ఎస్‌ఐలు గంగన్న, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.