11-04-2025 10:20:25 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీకి చెందిన దేవి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా పెంచుతున్న రెండు గంజాయి మొక్కలను శుక్రవారం స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ సిఐ ఎన్. దేవయ్య తెలిపారు. ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు సమాచారం అందడంతో వన్ టౌన్ ఎస్సై రాకేష్ కన్నాల బస్తిలోని దేవి శ్రీనివాస్ ఇంట్లో తనిఖీ చేసి పెంచుతున్న రెండు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు సిఐ దేవయ్య తెలిపారు.