కొండపాక: కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామానికి చెందిన వెలిశాల శ్రీనివాస్(30) తన వ్యవసాయ బావి వద్ద ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిలువచేసి అమ్ముతున్నాడని నమ్మదగిన సమాచారం మేరకు సిద్దిపేట త్రీ టౌన్, టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం సాయంత్రం దాడి చేసి బియ్యాన్ని స్వాధీన పరుచుకున్నారు. వెలిశాల శ్రీనివాసపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, త్రి టౌన్ పోలీసులు తెలిపారు.