calender_icon.png 2 April, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో అల్ఫాజోలం రాకెట్ ను పట్టుకున్న పోలీసులు

30-03-2025 04:41:08 PM

263 గ్రాముల అల్ఫజోలం స్వాధీనం, ముగ్గురి అరెస్ట్, మరొకరు పరారీ..

మత్తు పదార్థాలు అమ్మిన, నిల్వ ఉంచిన, వినియోగించిన కఠిన చర్యలు..

మద్నూర్, బిచ్కుంద పోలీస్ లను అభినందించిన ఎస్పి..

కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఆల్ఫాజోలం రాకెట్ ను మద్నూర్, బిచ్కుంద, పోలీసులు పట్టుకున్నారు. 263 గ్రాముల అల్ప జోలం స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురుని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదివారం తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి చెందిన ఉడతల వార్ సురేష్ గౌడ్ వద్ద అల్ఫజోలం ఉందన్న సమాచారం మేరకు మద్నూర్, బిచ్కుంద పోలీసులు దాడులు చేసి 110 గ్రాముల అల్పజోలం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని సురేష్ గౌడ్ ను అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు. సురేష్ గౌడ్ ఇచ్చిన సమాచారం మేరకు హయత్ నగర్ కు చెందిన దినేష్ కుమార్ మెహంతీనీ అదుపులోకి తీసుకొని తీసుకొని విచారించినట్లు తెలిపారు.

ఉప్పల్ నాచారంకు చెందిన కృష్ణ వద్ద కొనుగోలు చేసి మరింత ఎక్కువ రేటుకు అమ్ముతానని దినేష్ కుమార్ మెహంతీ తెలిపారు. అతనిని అదుపులోకి తీసుకొని విచారించగా ఉప్పల్ కు చెందిన కృష్ణ వద్ద కొనుగోలు చేస్తున్నట్లు దినేష్ కుమార్ మెహంతీ తెలిపారు. హైదరాబాద్ నాచారంలోని టెంపుల్ ఆర్గానిక్స్ కంపెనీలో 8 రకాల కెమికల్స్ కలిపి ఆల్ఫాజోలం తయారు చేసినట్లు కృష్ణ వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు. కృష్ణ వద్ద 153 గ్రాముల ఆల్ఫాజోలం, నాలుగు మొబైల్ ఫోన్ లు ఎనిమిది రకాల ముడి సరుకులు లభించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మద్నూర్ కు చెందిన శ్రీనివాస్ గౌడ్ కు పలుసార్లు ఆల్ఫాజోలం విక్రయించిన సంబంధం ఉందని ఎస్పీ తెలిపారు.

ప్రస్తుతం శ్రీనివాస్ గౌడ్ పరారీలో ఉండగా మద్నూర్ కు చెందిన సురేష్ గౌడ్, హయత్నగర్ చెందిన దినేష్ కుమార్ మహంతి ఉప్పల్ కు చెందిన కృష్ణలను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. బాన్సువాడ డి.ఎస్.పి సత్యనారాయణ ఆధ్వర్యంలో బిచ్కుంద సీఐ మద్నూర్ ఎస్సై పోలీస్ సిబ్బంది ఆల్ఫాజోలం రాకెట్ ను చేదించారని ఎస్పీ తెలిపారు. ఆల్ఫాజోలం రాకెట్ ను చేయించిన మద్నూర్, బిచ్కుంద పోలీస్ లతో పాటు డిఎస్పి సత్యనారాయణలను ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... కామారెడ్డి జిల్లాలో నిషేధిత మత్తుపదార్థాలు కలిగి ఉన్న సరఫరా చేసిన అమ్మిన వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు.