21-03-2025 12:50:27 PM
అనంతగిరి: మండల పరిధిలోని త్రిపురవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Tripuravaram Zilla Parishad High School)లో పదోవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద శుక్రవారం విద్యార్థుల సందడి నెలకొన్నది.వివిధ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మొత్తం137 మంది హాజరయ్యారు పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.పరీక్ష కేంద్రాన్ని మండల విద్యాధికారి తల్లాడ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. పోలీస్ శాఖ బందోబస్తు(Police department security) నడుమ పరీక్షలు ప్రారంభమయ్యాయి.పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఆరుబయట చెట్ల నీడలో సందడి నెలకొన్నది.