01-03-2025 08:21:53 PM
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో ఇటీవల బాధితులు పోగొట్టుకున్న 3 సెల్ఫోన్లను రికవరీ చేసి శనివారం బాధితులకు అందించినట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆలకుంట లక్ష్మణ్ జనవరి 02వ తారీఖు నాడు తన మొబైల్ ఫోన్ సోమార్పేట్ గ్రామంలో పోగొట్టుకున్నారని, గూల గంగారం తన మొబైల్ ఫోను ఫిబ్రవరి 24వ తారీఖు నాడు ఎల్లారెడ్డి పట్టణంలో పోగొట్టుకున్నట్లు, చాకలి సిద్దయ్య తన ఫోను ఫిబ్రవరి 6 తారీఖు నాడు సోమార్పేట్ గ్రామంలో పోగొట్టుకున్నట్టు వేరువేరుగా ముగ్గురు వ్యక్తులు ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారని, వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సిఇఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి సెల్ఫోన్లను గుర్తించి, స్వాధీనం చేసుకొని బాధ్యతలకు అందించామని ఎస్సై మహేష్ తెలిపారు.