నిర్మల్ (విజయక్రాంతి): టీజీపీఎస్సీ ద్వారా ఈనెల 15 16 తేదీల్లో నిర్మల్ జిల్లాలో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్ష నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు ఉంటాయని జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. ఈనెల 15 ఉదయం 6 గంటల నుంచి 16 సాయంత్రం 6:00 వరకు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలులో ఉంటుందని తెలిపారు. పట్టణంలో 8080 మంది అభ్యర్థులు పరీక్ష రాయలు ఉన్నారని వీరి కోసం 24 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయగా కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు ఉంటాయని ఆమె వెచ్చరించారు. 15 16 తేదీల్లో నిర్మల్ పట్టణంలో ఇంటర్నెట్ జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సూచించారు. పరీక్షలు పూర్తయ్యే వరకు పోలీస్ శాఖ సూచించిన నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని ఆమె అభ్యర్థులకు పేర్కొన్నారు.