calender_icon.png 27 September, 2024 | 9:40 AM

ఫీడ్‌బ్యాక్ సిస్టమ్‌తో పోలీసుల ప్రతిస్పందన మెరుగు

26-09-2024 02:10:26 AM

డీజీపీ డాక్టర్ జితేందర్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 25(విజయక్రాం తి): ఫీడ్‌బ్యాక్ సిస్టమ్‌తో పోలీసుల ప్రతిస్పందన మెరుగవుతుందని డీజీపీ డాక్టర్ జితేం దర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీస్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి డీజీపీ బుధవారం ప్రశంసా పత్రాలు అందజేశారు.

సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సెంటర్ ద్వారా 2,116 మంది పౌరుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా టాప్ 10 పోలీస్ స్టేషన్‌లు/ఎస్‌హెఓలు, అయిదుగురు రిసెప్షన్ ఆఫీసర్‌లు, అయిదుగురు ఎంక్వురై ఆఫీసర్‌లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడు తూ.. క్యూఆర్ కోడ్, ఎస్‌ఎంఎస్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ సిస్టమ్‌లతో సహా కొత్త సాంకేతిక ను త్వరలో ప్రవేశపెడతామని ప్రకటించారు.

ఈ వ్యవస్థలు పిటిషనర్లు, బాధితులు సులభంగా అభిప్రాయాన్ని అందించడానికి ఉపయోగపడుతుందన్నారు. వివిధ పోలీసు సేవలను ఉపయోగించుకునే పౌరులు, బాధితు ల నుంచి అభిప్రాయాలను సేకరించడం లో ఫీడ్‌బ్యాక్ కాల్ సెంటర్ ప్రాముఖ్యతను డీజీ పీ నొక్కిచెప్పారు.

సమావేశంలో అదనపు డీజీపీ (శాంతి భద్రతలు) మహేశ్ ఎం. భగవత్, ఎస్పీ శ్రీనివాస్, సీఐడీ సీఎస్పీ సీతారెడ్డి పాల్గొన్నారు. సీఐడీ డీజీ శిఖా గోయల్ ఆధ్వర్యంలో ఎస్పీ- శ్రీనివాస్, డీఎస్పీ సీతారెడ్డి నేతృత్వంలో పని చేసిన సిటిజన్ ఫీడ్‌బ్యాక్ టీమ్‌ను డీజీపీ అభినందించారు.