calender_icon.png 7 April, 2025 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబులెన్స్ ఆలస్యమని ముందే స్పందించిన పోలీస్

02-04-2025 12:58:33 AM

ఆటో బోల్తా ఘటనలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన ఎస్పీ

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 1 (విజయక్రాంతి) అదుపుతప్పి ఆటో బోల్తా పడిన ఘటనలో తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రులను జిల్లా ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్ పోలీస్ వాహనంలో తరలించి మానవత్వన్ని చాటుకున్నారు.

ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గేట్ సమీపంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.. ఎస్‌ఐ కురుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మహాదేవునిపేట్ గ్రామానికి చెందిన గోరేమియా మరో ముగ్గురు కలిసి ఆటోలో హైదరాబాదు నుండి సొంత గ్రామానికి ఆటోలో వెళ్తున్న క్రమంలో కొట్ర గేట్ సమీపంలో ఆడుపు తప్పి బోల్తా కొట్టింది.

దీంతో తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో కల్వకుర్తి నుండి వెల్డండ వెళుతున్న జిల్లా ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్ 108 అంబులెన్సు రావడం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ముందే పోలీసు వాహనంలో వారిని కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు. త్వరగా స్పందించడంతో బాధితులు స్వల్ప గాయలతో బయట పడ్డారని వైద్యులు తెలిపారు.