calender_icon.png 6 March, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోహన్ బాబుపై కేసు నమోదు

11-12-2024 09:44:19 AM

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు మోహన్ బాబు నివాసం సమీపంలో గత రాత్రి ఊహించని సంఘటనలు కొన్ని జరిగాయి. మనోజ్‌ను లోపలికి అనుమతించకపోవడంతో గేట్లు పగులగొట్టి నివాసానికి చేరుకున్నాడు. ఈ వివాదంపై ఆరా తీసేందుకు జర్నలిస్ట్ మోహన్ బాబు వద్దకు వెళ్లగా, ఆగ్రహించిన మోహన్ బాబు జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డాడు. జర్నలిస్టుకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మోహన్ బాబుపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 118 కింద పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మోహన్ బాబు, విష్ణు తమ తుపాకులను పోలీస్ స్టేషన్‌లో డిపాజిట్ చేయాలని పోలీసులు కోరారు.

ఈ ఘటన తర్వాత మోహన్‌బాబు అస్వస్థతకు గురికావడంతో ఆయనను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలో డిశ్చార్జి కానున్నారు. మొత్తానికి మంచు ఫ్యామిలీలో ప‌రిస్థితులు విష‌మంగా మారాయి. జర్నలిస్టుపై జరిగిన దాడితో మోహన్ బాబు తన స్థాయిని, పరువును కోల్పోయారు. మీడియా ప్రతినిధులపై దాడి ఘటనలో మోహన్ బాబుపై కేసు నమోదైంది. ఇవాళ విచారణకు రావాలని మోహన్ బాబు, మనోజ్, విష్ణుకు నోటీసులు పంపారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని ముగ్గురికి రాచకొండ సీపీ నోటీసులు ఇచ్చారు. మోహన్ బాబు, విష్ణు, మనోజ్ వ్యక్తిగతంగా విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. జల్ పల్లిలోని జరిగిన ఘటనపై రాచకొండ సీపీ విచారణ చేయనున్నారు. జల్ పల్లిలో జరిగిన దాడి ఘటనపై రాచకొండ సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోహన్ బాబు ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఆస్పత్రిలో ఉన్నారు.