ముత్తారం,( విజయక్రాంతి): మండలాల్లోని కేసనపల్లిలో మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తూ అసభ్యకరంగా వ్యవహరిస్తూ, అక్రమ విద్యుత్ సౌర్యం చేస్తూ పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన పలువురిపై దాడి చేసిన వ్యక్తులపై ముత్తారం పోలీసులు కేసు నమోదు చేశారు.
సోమవారం కేశనపల్లి గ్రామంలోని శ్రీపాద చౌక వద్ద ఏర్పాటుచేసిన వినాయకుడి నిమజ్జనం ఊరేగింపులో భాగంగా కేశనపల్లి హనుమాన్ టెంపుల్ దగ్గరికి చేరుకొని గ్రామ మహిళలు కోలాటం ఆడుతుండగా రాత్రి తొమ్మిది గంటల సమయంలో గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నూనె కుమార్, దొడ్ల రవి, తాత శ్రీనివాస్, తాత బాలయ్య, పోసాని సమ్మయ్య అను వ్యక్తులు కోలాటం ఆడుతున్న హనుమాన్ టెంపుల్ వద్దకు వచ్చి ట్రాలీలో డీజే బాక్సులు పెట్టుకొని వచ్చి ఆక్రమంగా విద్యుత్ చోరీ వాడుకుంటూ, పెద్ద శబ్దాలు చేస్తూ మహిళల ముందు అసభ్యకరంగా నృత్యాలు చేస్తూ అవహేళన చేసుకుంటూ మహిళలని బూతు మాటలు తిడుతూ, విధులు నిర్వహిస్తున్న విజయ్ కానిస్టేబుల్ అడ్డుకొని చొక్కా పట్టుకొని నెట్టి వేశారని, అక్కడే ఉన్న పెగడ కుమార్, బక్కతట్ల కుమార్, కోళ్ల మహేశ్వర్ లపై దాడి చేసి అందరి ముందు అవమానించారని, దాడి చేసిన వ్యక్తులపై కోళ్ల మహేశ్వర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన ఎస్ఐ నరేష దాడి చేసిన మాజీ సర్పంచ్ నూనె కుమార్, తాత శ్రీనివాస్, తాత బాలయ్య, దొడ్ల రవి, పోసాని సమ్మయ్య లా పై 296(b),115(2),352,351(3),r/w3(5)BNS,135ELA, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.