calender_icon.png 24 December, 2024 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు చేరువలో పోలీస్

24-12-2024 12:57:56 AM

* పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు

* గంభీరావుపేట మండలంలో మెగా వైద్య శిబిరం 

* 300 మందికి వైద్య పరీక్షలు

* శిబిరాన్ని ప్రారంభించిన  జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 

 సిరిసిల్ల, డిసెంబర్ 23 (విజయ క్రాంతి): గ్రామీణ ప్రాంత ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ అవ్వడానికి విన్నూత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగా  ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని  మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబి రాలు ఏర్పాటు చేయడం జరిగిందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.

సోమవారం  గంభీరావుపేట్ మండలం లింగాన్నపేట (ఎర్రషేలక తండా) లో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అశ్వినీ హాస్పి టల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతి ధిగా హజరై, మాట్లాడారు.. జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతాల్లో ఉండే ప్రజల శ్రేయ స్సును దృష్టిలో ఉంచుకుని వారికి సత్వరమే వైద్యం సేవలు అందించడమే లక్ష్యంగా ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసి, నిపుణులు, డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో కంటి, దంత, గైనకాలజిస్ట్, న్యూరో, జనరల్ ఫిజీషియన్, జనరల్ సర్జన్ ,అర్ధోపెడిక్, పిల్లల వైద్య నిపుణులు, ఊపిరితిత్తుల వైద్య నిపుణులు సమక్షంలో వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు.

ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం చికిత్సలు అందిం చడాం జరిగిందన్నారు.ఆరోగ్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రజలకు, పోలీస్ సేవలు మరింత దగ్గర అవ్వడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయి అన్నారు. పోలీస్ ఉన్నది ప్రజా భద్రత కోసమే అనే నమ్మకం కలగడం కోరకు కమ్యూనిటీ పోలి సింగ్‌లో భాగంగా వివిధ కార్యక్రమాలు చేస్తామన్నారు. 

అందులో భాగంగా గతం లో వీర్నపల్లి,రుద్రంగి మండల పరిధిలోని వివిధ గ్రామాల యువతకు స్పోర్ట్స్ కిట్స్ ,ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంతో పోల్చుకుంటే ప్ర స్తుతం ఎన్నో సౌకర్యాలు మెరుగు పడ్డా యని తల్లిదండ్రులు అందరూ తమ పిల్లల ను చక్కగా చదివించుకుని ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సౌకర్యాలను సద్వినియొగం చేసుకో వాలన్నారు.

యువత చెడు మార్గాల వైపు మరలకుండా చూసుకునే బాధ్యత తల్లిదం డ్రుల మీద  ఉందని,గంజాయి అలవాటు పడిన వారి వివరాలు అందించాలని వారికి వైద్య నిపుణుల చేత కౌన్సెలింగ్ నిర్వహి స్థామన్నారు. ఉచిత మెగా వైద్య శిబిరానికి పిలువగానే వచ్చిన ఎల్లారెడ్డిపేట్ అశ్విని హాస్పిటల్  వైద్య బృందానికి జిల్లా ఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్.ఐ శ్రీకాంత్, వైద్య నిపుణులు, గ్రామ ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు.