ఇల్లెందు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం దాసుతాండా, గోల్యాతండా గ్రామాల్లో బుధవారం పోలీసులు, ఆబ్కారీ అధికారులు దాడులు నిర్వహించారు. దాసుతండాలో ఒక ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన నాటు సారాయిని పట్టుకున్నారు. దాసుతాండాకు చెందిన బానోత్ రామ అనే వ్యక్తి ఇంట్లో సుమారు 4 లీటర్ల నాటుసారా లభ్యం కావడంతో స్వాధీన పరుచుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గోలియా తండాలో మూడ్ సుందర్ ఇంటి వెనక పత్తి చేలో నాటు సారా తయారీ కోసం సిద్ధం చేసిన సుమారు 15 లీటర్ల వాష్ ని టేకులపల్లి పోలీస్, ఎక్సయిజ్ శాఖ వారితో కలిసి పట్టుకోవడం జరిగిందని టేకులపల్లి ఎస్సై పోగుల సురేష్ తెలిపారు.