మణుగూరు, డిసెంబర్ 29: కోడి పందాల స్థావరంపై ఏడూళ్ల బయ్యా రం పోలీసులు కొరడా ఝులిపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగూడెం అటవీ ప్రాంతంలో మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ఎస్సై రాజకుమార్ ఆదివారం దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో కోడిపందాలు నిర్వహిస్తున్న పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 9 బైకులు, కోడిపుంజులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. పేకాట, కోడి పందాలు ఆడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.