నిర్మల్ (విజయక్రాంతి): సంక్రాంతి పండుగ నేపథ్యంలో చిన్నపిల్లలు పతంగులకు వినియోగించుకునే దారం చైనా మాంజా నియంత్రణపై జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని నిర్మల్ ఖానాపూర్ బైంసా ముధోల్ తదితర మండలలో తనిఖీలు నిర్వహించి చైనా మాంజా అమ్ముతున్న దుకాణాలపై చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. చైనా మాంజా విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఆమె కోరారు.