15-04-2025 08:38:15 AM
చైతన్యపురి : హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్(Chaitanyapuri Police station) పరిధిలోని వైల్డ్ హార్ట్ పబ్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ పబ్ యాజమాన్యం సమయానికి మించి వైల్డ్ హార్ట్ పబ్((Wild Hearts Pub))ను నడుపుతుంది. ముంబై నుంచి యువతులను రప్పించి(Mumbai girls) అభ్యంతరకర నృత్యాలు చేయిస్తున్నారనే సమాచారంతో సోదాలు జరిపారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యువతుల చేత అసభ్యకర పనులు(Mumbai Dancers) చేయించినట్లు ఆరోపణలున్నాయి. ఈ సోదాల్లో 17 మంది యువతులను పోలీసులు(Chaitanyapuri Police) అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పబ్ నిర్వాహకుడు, వినియోగదారులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.