15-04-2025 08:59:18 AM
- చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో
17 మంది యువతులు అరెస్ట్
- సమయపాలన పాటించని నిర్వాహకులు
ఎల్బీనగర్: పబ్ లో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్(Chaitanyapuri Police Station) పరిధిలోని ఖిల్లా మైసమ్మ ఆలయ సమీపంలో ఉన్న వైల్డ్ హార్ట్ క్లబ్ పై సోమవారం రాత్రి పోలీసులు దాడి చేశారు. సమయానికి మించి పబ్ నడపడం, యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. కస్టమర్లని ఆకట్టుకునేలా యువతులతో అసభ్య నృత్యాలు చేయిస్తున్నారు. ముంబై నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. మొత్తం 17మంది యువతులు, పబ్ నిర్వాహకుడు, కస్టమర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.