calender_icon.png 22 February, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వల్లభనేని వంశీ ఇంట్లో పోలీసుల సోదాలు

16-02-2025 12:16:50 AM

* కీలక ఆధారాలు సేకరించేందుకు  ఆయన ఫోన్ కోసం వెతుకులాట

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): టీడీపీ కేంద్ర కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ అనే వ్యక్తిని అపహరించి, దాడిచేసిన కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఇందులో భాగంగానే శనివారం హైదరాబాద్ రాయదుర్గంలోని వల్లభనేని ఇంట్లో శనివారం ఏపీ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించి వంశీ ఫోన్‌పై స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఈ ఫోన్ దొరికితే కేసుకు సం  కీలకమైన ఆధారాలు ల  అవకాశముందని భావిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఆయన్ను అరెస్ట్ చేసే సమయంలో వంశీ సెల్‌ఫోన్ దొరకలేదు. వ్యక్తిగత సహాయ  ఫోన్‌ను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పం  వంశీ సెల్‌ను స్వాధీనం చేసుకునేందుకు కోర్టు అనుమతి కోరు  విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఇప్పటికే పోలీసులు పిటిషన్ వేశారు. ఫోన్ తమ చేతికి వస్తే గుట్టు వీడే ఛాన్స్ ఉందని పోలీసులు భావిస్తున్నారు.