05-04-2025 12:00:00 AM
తొమ్మిది మంది అరెస్ట్
ఆదిలాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే స్థానిక జెడ్పి క్వార్టర్స్ వద్ద పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. పేకటాడుతున్న కుందావార్ రాజేష్, దేగావత్ అశోక్, నల్లూరి దామోదర్, సునీల్ గౌడ్, బెజ్జంకి అనిల్, గజానన్, తోట శ్రీనివాస్, సిగ్గం రాజేష్, ఆకుల భూమయ్యలను పట్టుకున్నారు. వీరి నుండి రూ.39,600 నగదు, పేకాట ముక్కలు, 7 బైకులు, 9 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేసినట్లు పట్టుబడ్డ వారిలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారన్నారు.