calender_icon.png 19 April, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరాలపై పోలీసుల దాడి

16-04-2025 10:49:12 PM

తొమ్మిది మందిపై కేసు..

సిర్గాపూర్: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని వాసర్ గ్రామ శివారులోని జొన్న చెన్లల్లో విడివిడిగా చెట్ల కింద పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమచారం రావడంతో వెంటనే ఎస్సై వెంకట్ రెడ్డి(SI Venkat Reddy) సిబ్బంది కరుణాకర్, ప్రశాంత్, ధనరాజ్, ఫర్హాన్ లతో కలిసి దాడి చేయగా తొమ్మిది మంది పేకాటరాయుళ్ళను పట్టుకోవడం జరిగింది. పేకాట రాయుల వద్ద మొత్తం 5750/- రూపాయలు సీజ్ చేసి కేసు నమోదు చెయ్యడం జరిగింది. పట్టుబడ్డ వారిని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతోందని ఎస్సై వెంకట్ రెడ్డి అన్నారు. అలాగే మండలంలో ఎవరైనా పేకాట ఆడితే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్సై తెలిపారు.