01-04-2025 11:50:40 PM
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ మాధవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని నాగర్ కర్నూల్ రోడ్ వైపు అఖిల్ అనే వ్యక్తి ఇంట్లో క్రాంతి అనే వ్యక్తి పేకాట ఆడిపిస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ సిబ్బంది మెరుపు దాడి నిర్వహించారు. సుమారు 14 మంది వ్యక్తుల్లో ఏడుగురు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వారి వద్ద నుండి 66,700 నగదు, సెల్ ఫోన్లు, పేక ముక్కలను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరో ఏడుగురు తప్పించుకున్నారా లేదా తప్పించారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.