calender_icon.png 3 April, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

01-04-2025 11:16:20 PM

నలుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్..

రూ.22,260 ల నగదు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం..

కామారెడ్డి (విజయక్రాంతి): పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పేకాట స్థావరంపై మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వాడి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న 22,260 రూపాయల నగదును నాలుగు సెల్ ఫోన్లను రెండు బైకులు సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. మాచారెడ్డి పాల్వంచ మండలాల పరిధిలో ఎక్కడ పేకాట ఆడిన 100 కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పేకాట ఆడిన చట్టా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు.