calender_icon.png 12 February, 2025 | 11:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

12-02-2025 07:42:28 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): మండలంలోని బలరావు పేట గ్రామ శివారులో పేకాట స్థావరంపై బుధవారం లక్షెట్టిపేట ఎస్సై సతీష్ సిబ్బందితో కలిసి 7 గురు పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై సతీష్ తెలిపిన వివరాలు ప్రకారం... బలరావుపేట గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారాన్న పక్క సమాచారం మేరకు పోలీస్ సిబ్బంది దాడి చేసి పేకాట ఆడుతున్న బత్తుల రమేష్, కోన తిరుపతి, బేర రాజయ్య, సంగం ఒదయ్య, గోర్క మల్లేష్, వనపర్తుల సుధాకర్, మండే సత్తన్న ను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 5 బైకులు, 6 సెల్ ఫోన్లు, 13 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.