calender_icon.png 14 January, 2025 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

13-01-2025 10:31:24 PM

పేకాట ఆడుతున్న ఆరుగురి అరెస్ట్ 13 వందలు నగదు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం...

కామారెడ్డి (విజయక్రాంతి): పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు సోమవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం హాజీపూర్ గ్రామంలో పోలీసులు దాడులు నిర్వహించగా నిర్వహించగా హాజీపూర్ గ్రామానికి చెందిన ఆరుగురు పేకాటరాయలు పట్టుబడ్డారు. మరో 9 మంది పరారయ్యారు. గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో పేకాట ఆడుతున్నారన్న విశ్వాసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేయగా పేకాట ఆడుతున్న ఆరుగురు సభ్యులను అరెస్టు చేయగా, పేకాట ఆడుతున్న తొమ్మిది మంది తప్పించుకున్నట్లు నస్రుల్లాబాద్ పోలీసులు వెల్లడించారు. వారి వద్ద నుంచి 1300 నగదు, మూడు సెల్ ఫోన్లు, ఆరు బైకు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.