02-04-2025 12:39:43 PM
60 వేలు నగదు, 9 బైక్లు, ఒక కారు స్వాధీనం
టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి- కొత్తగూడెం హైవే రహదారిలోని సమ్మక్క గద్దెల సమీపంలో పొలాలలో చిత్తు బొత్తు పైసల ఆటలు ఆడుతున్న స్థావరంపై టేకులపల్లి పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. టేకులపల్లి, జూలూరుపాడు మండలాలకు చెందిన 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడులలో 14 సెల్ ఫోన్లు, రూ.60 వేలు నగదు, 9 ద్విచక్ర వాహనాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ పోగుల సురేష్ మాట్లాడుతూ... మండల పరిధిలో గత కొంత కాలంగా గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న చిత్తు బొత్తు పైసల ఆటలో చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయన్నారు.
ఈ ఆటలపై ఇప్పటివరకు ఎలాంటి నిఘా లేకపోవడంతో ఈ పైసల ఆట గత కొంత కాలంగా జోరుగా సాగుతుందని, ఇకపై ఎవరైనా ఇలాంటి ఆటలు ఆడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గ్రామాలలో జరుగుతున్న జూదం, బెట్టింగులు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై సమాచారం ఉంటె ఇవ్వాలని ప్రజలను కోరారు. యువత చెడు మార్గంలో వెళ్లి జీవితాన్ని నాశనం తీసుకోకుండా భవిష్యత్తు అంధకారం చేసుకోకూడదని సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని కోరారు. టేకులపల్లి మండలానికి చెందిన మూడ్ పవన్, మూడ్ గణేష్, గుగులోత్ వెంకన్న, మూడ్ భాస్కర్, భూక్యా ద్వాలియా, గుగులోత్ భద్రు, బానోత్ సురేందర్, అంగోత్ తులసిరామ్, చాపల వెంకన్న, జూలూరుపాడు కీ చెందిన తేజవత్ నర్సింహా, ఎస్ కే మస్తాన్, గొడుగు వీరబాబు, జంగం రాము, భూక్యా అజయ్, గూగులోతు గోపాల్, భాదవత్ శివ అరెస్ట్ అయిన వారని ఎస్సై తెలిపారు.