calender_icon.png 24 October, 2024 | 1:41 PM

కోడిపందెం స్థావరాలపై పోలీసుల దాడి

24-10-2024 01:11:21 AM

నాగర్‌కర్నూల్/గద్వాల, అక్టోబర్ 23 (విజయక్రాంతి): కోళ్ల పందేలు ఆడుతున్న స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆరు గురు వ్యక్తులు, 21 ద్విచక్ర వాహనా లు, 12 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం బాడుగదిన్నెలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

సీఐ మహేశ్ వివరాల ప్రకారం.. సుమారు 50 మంది కి పైగా కోడి పందేలు ఆడుతున్నట్టు స్థానికుల నుంచి డయల్ 100 ఫిర్యా దు మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులను చూసి పందెంరాయుళ్లు పరారవ్వగా ఆరుగురు చిక్కారు.

అయితే, నిందితులే పరారయ్యారా?పోలీసులు ‘మామూలు’గా తీసుకున్నారా అని స్థానికులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని నెట్టెంపాడు శివారులో ఏడుగురు పందెంరాయుళ్లతోపాటు 10 పందెం కోళ్లు, 3 బైక్‌లు, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై అబ్దుల్ షకూర్ తెలిపారు.