23-03-2025 07:52:12 PM
పారిపోయిన వ్యక్తులు...
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలంలో గల బుయ్యారం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న గుడుంబా స్థావరాలపై ఆదివారం సాయంత్రం నీల్వాయి ఎస్సై శ్యామ్ పటేల్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులను చూసి గుడుంబా స్థావరాలు నిర్వహించే వ్యక్తులు అడవిలోకి పారిపోయారని ఎస్సై శ్యాం పటేల్ తెలిపారు. మండలంలోని అటవీ ప్రాంతాల్లో గుడుంబా స్థావరాలు కొనసాగుతున్నట్లు సమాచారం అందడంతోనే ఈ దాడులు నిర్వహించినట్లు చెప్పారు. ఎవరైనా గుడుంబా తయారుచేసి అమ్మితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.