calender_icon.png 2 April, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోడిపందేల స్థావరంపై పోలీసుల దాడి

01-04-2025 01:56:18 AM

మేడ్చల్, మార్చి 31 (విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా పేటి బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవరయంజాల్ శివారు లో కోడిపందాల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. బాల్ రెడ్డి మామిడి తోటలో కోడిపందాలు ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 27 వేల నగదు, 15 కోడి కత్తులు, ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పెట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.