calender_icon.png 26 April, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

25-04-2025 11:56:28 PM

ఇద్దరు విదేశీయులు సహా మరో వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి) : సికింద్రాబాద్ లాలాగూడ విజయ్‌పాల్ కాలనీలో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఓయూ పోలీసులతో కలిసి ఓ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఉగాండాకు చెందిన ఓ మహిళ, ఓ యువతితో కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వారితో పాటు ఇద్దరు విఠులను అదుపులోకి తీసుకున్నారు. ఉగాండాకు చెందిన నయెబరే డొరీన్ అనే మహిళ,  మాళీకి చెందిన అదమాబహ్ అనే వ్యక్తితో పాటు ఎల్బీనగర్‌కు చెందిన ఎన్ సందీప్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్  చేశారు. ఉగాండాకు చెందిన యువతిని కాపాడారు. వారి నుంచి రూ.13,500నగదు,  3సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.