calender_icon.png 16 March, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

17-12-2024 12:53:33 AM

నిజామాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): నిజామాబాద్‌లోని వ్యభిచార గృహంపై సీసీఎస్, ఏసీపీ బృదం ఆదివారం రాత్రి దాడి చేసింది. నగర శివారులోని పాగ్ర అనే గ్రామంలో ఒక ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.3,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ నాంగేద్రచారి తెలిపారు.