calender_icon.png 28 November, 2024 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యభిచార గృహంపై పోలీసుల రైడ్

25-09-2024 02:27:45 AM

ఎల్బీనగర్, సెప్టెంబర్ 24 : మన్సూరాబాద్‌లోని హిమపురి కాలనీలోని ఓ ఇం ట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఎల్బీనగర్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించి బలవంతంగా ఓ మహిళను సెక్స్ వర్కర్‌గా మార్చిన విటుడి తో పాటు వ్యభిచార గృహ నిర్వాహుకుడిని అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాలు.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలానికి చెందిన రావిశెట్టి దయాకర్(35) మన్సూరాబాద్‌లోని హిమ పురి కాలనీలో ఉంటూ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థిక సమస్య ల కారణంగా తాను ఉంటున్న అద్దె ఇంట్లోనే  మహిళా సెక్స్ వర్కర్లతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు.

ఇలా కొన్ని నెలలుగా ఈ వ్యాపార కొనసాగుతోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు దయాకర్ ఇంటిపై దాడిచేసి సెక్స్ వర్కర్‌ను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. నిర్వాహకుడు దయాకర్, ఉప్పల్‌కు చెందిన విటుడు సుదర్శన్‌చారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.