03-03-2025 07:28:50 PM
ఎల్లారెడ్డి డిస్పీ శ్రీనివాసులు..
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): రంజాన్ పండగ సందర్భంగా శాంతి భద్రతల విషయంలో ప్రజలకు భరోసా కల్పించేందుకు విఆర్ విత్ యు అంటూ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, పోలీసులతో సోమవారం ఎల్లారెడ్డి పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాతో పాటు ప్రధాన వీధుల గుండా బాలికల పాఠశాల, ప్రైమరీ హెల్త్ సెంటర్, మైనార్టీ గురుకుల పాఠశాల, రాధాస్వామి సత్సంగ్ నుంచి నాలుగు కిలోమీటర్ల మేర 40 మంది రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది, పోలీసులతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ... రంజాన్ పండగ దృష్ట్యా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంతో పాటు ఎల్లారెడ్డి పట్టణ పరిధిలోని గ్రామాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ప్రజలకు శాంతి భద్రతపై భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు.
ముఖ్యంగా ఎల్లారెడ్డి మండలంలోని ప్రజలు వాట్సాప్ గ్రూప్ లలో రిలీజియన్ కు సంబంధించిన పోస్టులను పెడుతున్నారని గ్రూప్ అడ్మిన్ ఈ విషయాలను గమనించాలని రిలీజియన్ కు సంబంధించిన పోస్టులను పెడితే గ్రూప్ అడ్మిన్ ల పైన వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామ ప్రజలలో సద్భావనను, శాంతిని కలిగించే విధంగా భరోసా కల్పించడానికి పోలీస్ కవాతు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కవాతుకు హైదరాబాద్ అకింపేట నుండి వచ్చిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండర్ డి.పి భగేల్, ఎస్సై వెంకట్ రావు, ఎఆర్ ఎస్సై సాయిలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.