05-03-2025 07:19:59 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో పోలీస్ స్టేషన్ దగ్గర నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బుధవారం నాడు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఎఎఫ్)పోలీసుల బృందంతో కవాతు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రవీందర్ నాయక్ మాట్లాడుతూ.... జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. పోలీసులు ఎల్లప్పుడూ ప్రజల శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ఉంటారని, దుష్టశక్తుల వలన సమాజంలో అలజడి ఏర్పడినప్పుడు అత్యవసర పరిస్థితులలో ప్రజలకు మేమున్నామని భరోసా కల్పించడానికి సుమారు 40 మంది బలగాలతో కవాతు ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎస్సై మహేష్ స్థానిక పోలీసులు తదితరులు పాల్గొన్నారు.