09-03-2025 08:54:12 PM
కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు కవాత్ ను నిర్వహించారు. కాకతీయ నగర్, గాయత్రి నగర్, దేవునిపల్లి, సరంపల్లిలో, పోలీసులు కవాతును నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకారం అందించాలని కాలనీవాసులను కోరారు. కాలనీలో కొత్త వ్యక్తులు అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రూరల్ సీఐ రామన్ ఎస్ఐ రాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.