calender_icon.png 14 March, 2025 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడ్డిఅన్నారం మార్కెట్‌లో పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయాలి

12-03-2025 12:08:13 AM

మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి

రాచకొండ సీపీ సుధీర్‌బాబుకు వినతిపత్రం అందజేత

అబ్దుల్లాపూర్ మెట్, మార్చి 11: మామిడి సీజన్ దృష్టిపెట్టుకుని బాటసింగారం పండ్ల లమార్కెట్‌లో పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం రాచకొండ కమిషన్‌రేట్ ఎల్బీ నగర్ క్యాంప్ కార్యాలయంలో సీపీ సుధీర్ బాబును కలిసి వినతి పత్రం అందజేశారు. గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని బాటసింగారం పండ్ల మార్కెట్ లో ఈ సంవత్సరం మామిడి పండ్ల విక్రయాలు అధికంగా జరిగే అవకాశం ఉన్నందున మార్కెట్ ప్రాంతంలో పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని సీపీ సుధీర్‌బాబుకు వివరించారు. అనంతరం గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ... మామిడి సీజన్ దృష్టిపెట్టుకుని బాటసింగారం పండ్ల లమార్కెట్‌లో పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయాలన్నారు.

గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా మామిడి క్రయ విక్రయాలు,నగదు లావాదేవీలు అధికంగా ఉండే అవకాశం ఉన్నందున తాత్కాలిక మార్కెట్ లో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటుందని సీపీ తెలియజేశారు. సీపీ సుధీర్ బాబు వెంటనే స్పందించి కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారన్నారు. అదేవిధంగా పండ్ల మార్కెట్ కి వచ్చే దిగుమతులను తగ్గించే విధంగా కొంతమంది బ్రోకర్లతో కుమ్మక్కై బయట ప్రాంతాలలో వ్యాపారం చేస్తూ అమ్ముతున్నారని దీనివలన మార్కెట్ ఆదాయానికి గండి పడుతున్నట్లు తెలిపారు. ఇలాంటి వారిపై నిఘా ఉంచి ఎస్‌ఓటీ, విజిలెన్స్ వారితో తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సీహెచ్ బాస్కర చారి, డైరెక్టర్లు జైపాల్ రెడ్డి,గణేష్,రఘుపతిరెడ్డి, అంజయ్య, వెంకటేశ్వర్లు గుప్తా పాల్గొన్నారు.