11-03-2025 01:20:23 AM
కామారెడ్డి అడిషనల్ ఎస్పీ
చైతన్య రెడ్డి ఆదేశాలు
కల్లు మూస్తేదారుల ముందడుగు
కామారెడ్డి, మార్చి 10 (విజయక్రాంతి) ః ప్రభుత్వ చట్టాలు బలంగా ఉన్నా వాటిని అమలు చేసే సత్తా చిత్తశుద్ధి ఉండి అమలు చేస్తే ఏ పనైనా సాధ్యం కాదని అనడానికి కామారెడ్డి జిల్లాలో కల్లు మూస్తే దారులతో ఇటీవల కామారెడ్డి అడిషనల్ ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. అడిషనల్ ఎస్పీ ఆదేశాలతో కల్లు మూస్తే దారు లలో వారం రోజుల్లోనే చలనం వచ్చింది. 18 సంవత్సరాలలోపు పిల్లలకు కల్లు విక్రయించరాదని ఒక్కొక్క కళ్ళు దుకాణానికి ఆరు సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశాలు జారీ చేశారు. వారం రోజులపాటు దేవుని పల్లిలో ఐదు కల్లు దుకాణాలను మూసివేసిన విషయం విధితమే. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న కల్లు మూస్తే దారుల్లో ఆందోళన వ్యక్తమైంది.
ప్రభుత్వ నీయమ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారం రోజుల్లో సీసీ కెమెరాలను కళ్ళు దుకాణాలలో అమర్చుకోవడమే కాకుండా బ్యానర్లు ఏర్పాటు చేస్తామని 18 సంవత్సరాల లోపు పిల్లలకు కళ్ళు విక్రయించమని అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డికి జిల్లాలోని కల్లు మూస్తే దారులు ప్రామిస్ చేశారు. అధికారుల్లో చిత్తశుద్ధి ఉంటే సమాజంలో మార్పు సాధ్యమవుతుందనడానికి కామారెడ్డి అడిషనల్ పోలీస్ సూపర్డెంట్ చైతన్య రెడ్డి ఒక నిదర్శనంగా నిలుస్తుంది. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు జోరు అనే శీర్షికతో విజయక్రాంతిలో వచ్చిన కథనానికి స్పందించిన వెంటనే 12 గంటలలోనే జిల్లాలోని క ల్లు మూస్తే దారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
నిర్వహించిన రెండు రోజులకి 18 సంవత్సరాల లోపు పిల్లలకు దేవునిపల్లి కల్లు దుకాణాలలో కల్లును విక్రయించడంతో ఏ ఎస్ పి చైతన్య రెడ్డి దృష్టికి వెళ్లడంతో వెంటనే 5 కల్లు దుకాణాల లో కల్లు విక్రయాలను నిలిపి వేయించారు. కల్తీకల్లు నివారణలో భాగంగా ఏఎస్పి తీసుకుంటున్న చర్యలు సఫలీకృతం ఆచరణ అమలు జరుగుతుండడంతో పట్టణంలోని పలువురు మేధావులు విద్యావంతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కళ్ళు దుకాణాల్లోకి 18 సంవత్సరాల లోపు పిల్లలను అనుమతించరాదని వారికి క ల్లు విక్రయించరాదని ఇదే క్రమంలో ఒక్కొక్క కల్లు దుకాణంలో ఆరు సీసీటీవీ కెమెరాలు అమర్చాలని 15 రోజుల క్రితంకల్లు వస్తే దారులకు కామారెడ్డి ఏఎస్పీ కార్యాలయానికి పిలిపించుకొని ఆదేశాలు జారీ చేశారు.
నిబంధనలను సత్వరమే అమలు చేయడంలో జాప్యం చేయడంతో చిన్నపిల్లలు కల్లు తీసుకు వెళుతున్న చిన్నారుల ఫోటోలను కల్తీ కల్లు తయారు చేస్తున్న విధానాలను వీడియో తీసి కామారెడ్డి ఏ ఎస్ పి కి కొందరు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో తక్షణమే స్పందించిన ఏ ఎస్ పి చైతన్య రెడ్డి దేవునిపల్లి శివారులోని ఐదు కల్లు దుకాణాలను మూసి వేయించారు. అంతేకాకుండా వీరిపై కేసులు నమోదు చేయడం జరిగింది. కళ్ళు ముస్తాదారులు కాంగ్రెస్ పార్టీ రాష్ర్టస్థాయి నాయకులతో కలిసి ఏఎస్పీకి ఫోన్ చేయించినప్పటికీ చట్ట పరిధిలో కల్లు విక్రయాలు జరుపుకోవాలని పేర్కొన్నట్లు సమాచారం. భవిష్యత్తు ఉన్న భావితరాల పిల్లల కల్తీ కల్లు సేవిస్తే వారికి భవిష్యత్తు లో ఎదురయ్యే సమస్యలను వారి జీవితాలు నాశనం కుటుంబాలు ఇబ్బందులు పడుతాయి అన్న తీరును క ల్లు మూస్తే దారులకు అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి వివరించారు.
కల్తీకల్లుకు బానిసలుగా తయారుచేసి వారి జీవితాలతో ఆడుకోవడం వారి జీవనస్థితిగతులు చెల్లాచెదరయిపోవడం లాంటి దయనీయ పరిస్థితులు ఎదురుకాకుండా ఉండడం కోసం కామారెడ్డి అసిస్టెంట్ పోలీసు సూపరిండెంట్ చట్టపరిదిని ఉపక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిం చారు. చట్ట పరిధిలో కల్లు దుకాణాలు నడుపుకుంటామని హామీ ఇచ్చి ప్రతి కల్లు దుకాణంలో ఆరు సీసీటీవీ కెమెరాలు అమర్చుకుంటామని పేర్కొనడంతో పాటు అమలు చేస్తున్నారు. క ల్లు దుకాణం లా ఎదుట బ్యానర్ లను కొంతమంది ఏర్పాటు చేసుకోగా మరి కొంతమంది ఏర్పాటు చేయడంలో నిమగ్నం కాగా మరి కొంతమంది చూద్దాంలే అనే ధోరణిలో ఉన్నారు.
కామారెడ్డి జిల్లాలో కల్తీకల్లు విచ్చలవిడిగా నడుస్తోంది. కల్లు ముస్తదారులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి వారికి ఇష్టం వచ్చిన రీతిలో జిల్లావ్యాప్తంగా ఉన్న కల్లు దుకాణాలలో కల్తీ కల్లును తయారు చేస్తూ సామాన్య, మధ్యతరగతి ప్రజలను కల్తీ కల్లు కు బానిసలుగా మార్చుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో జోరుగా కల్తీ కల్లు విక్రయాలు సాగుతున్నాయి. 18 సంవత్సరాల లోపు పిల్లలు కూడా కల్తీకల్లుకు బానిసలై కల్లు సేవించనిదే జీవించలేని స్థాయికి దిగజారడంతో కల్తీ కల్లులో కలిపేమత్తు పదార్థాలు మానవ అవయవాలైన నాడీ వ్యవస్థ, కండరాలు, కంటి చూపు పోయే ప్రమాదం ఉంది.