calender_icon.png 29 January, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్

24-10-2024 03:27:42 PM

జగిత్యాల,(విజయక్రాంతి): జగిత్యాల పోలీస్ మైదానంలో విద్యార్థులకు పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.... పోలీస్ శాఖ ప్రజలకు  అందిస్తున్న సేవలపై, పోలీస్ శాఖ పనితీరు, వివిధ అంశాలపై విద్యార్ధిని, విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఊదేశ్యంతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులు విద్యతోపాటు సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగహన పెంచుకోవాలని పేర్కొన్నారు. 

విద్యార్ధులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ అంటే ఏమిటి, అది ప్రజలకు శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది. దాని ఫంక్షన్నింగ్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకోసమే గురువారం స్టాల్స్ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఫ్రెండ్లీ  పోలిసింగ్ విధానం ద్వారా ప్రజలకు దగ్గర అవుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం డే/నైట్ బీట్స్, పెట్రోలింగ్ వ్యవస్థలు ఏవిధంగా పని చేస్తాయో వివరించారు. 

పోలీసు శాఖ నేరస్తులను సులువుగా గుర్తించడం కోసం అభివృద్ధి చేసిన ఫేస్ రికగ్నిషన్ సిస్టం, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ వంటి నూతన సాంకేతికతల గురించి వివరించారు. నేరాలు  జరగకుండా నివారించడంలో, జరిగిన నేరాన్ని త్వరగా చేదించడంలో సీసీ కెమెరాలు ఏవిధంగా ఉపయోగపడతాయో తెలిపారు. మహిళలు,  విద్యార్థినుల రక్షణ కోసం ఏర్పాటైన షీ టీమ్, భరోసా సెంటర్ ఏ విధంగా పనిచేస్తాయో వెల్లడించారు. పోలీస్ శాఖ  ఉపయోగించే ఆయుధాలు, వాటి పనితీరు, ఏ సందర్భాలలో ఉపయోగపడతాయో వివరించడం జరిగింది.