calender_icon.png 17 January, 2025 | 7:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర సరిహద్దులో పోలీసులు అప్రమత్తం

17-01-2025 12:50:23 AM

కర్ణాటక వైపు నుంచి వస్తున్న వాహనాలను తనిఖీలు 

సంగారెడ్డి, జనవరి 16 (విజయ క్రాంతి): కర్ణాటకలోనూ ఇద్దరు పట్టణంలో పట్టపగలు కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై దొంగలు కాల్పులు జరిపి నగదు తీసుకొని పారిపోయారు. గురువారం మధ్యాహ్నం బీదర్ పట్టణంలో శివాజీ సర్కిల్ సమీ పంలో ఉన్న ఎస్బిఐ ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వాహనంలో సిబ్బంది రావడం జరిగింది.

కలెక్టర్ కార్యాలయం, జిల్లా కోర్టు సమీపంలో ఎస్బిఐ ఎటిఎం ఉండ డంతో ఎప్పుడు జనాలతో కళకళలాడు తుంది. ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వాహనంలో వచ్చిన సిబ్బందిపై గుర్తుతెలి యని వ్యక్తులు ఇద్దరు బైక్ పై వచ్చి ఆకస్మికంగా కాల్పులు జరిపారు. దొంగలు జరిపిన కాల్పుల్లో ఏటీఎం ఉద్యోగి ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

దొంగల కాల్పుల్లో గిరీష్ అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఎస్బిఐ ఏటీఎంలో పెట్టేందుకు తీసుకువచ్చిన రూ. 93 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. టేక్ పెట్టెలో తీసుకోవాల్సిన నగదును దొంగలు బైకుపై తీసుకొని పారిపోయారు. సంఘటన స్థలానికి బీదర్ ఎస్పీ ప్రదీప్ గూంటి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. 

కర్ణాటక పోలీసులు ఇచ్చిన సమాచారంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీసులు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రతి రోడ్డుపై వాహనాలను తనిఖీలు నిర్వహించారు. 65వ జాతీయ రహదారి, జహీరాబాద్ బీదర్ రోడ్డుపై పోలీసులు కర్ణాటక వైపు నుంచి వస్తున్న వాహనాలను తనిఖీలు చేశారు. హద్నూర్ ఎస్సై చల్ల రాజశేఖర్ బీదర్ సరిహద్దులో ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. సంగారెడ్డి జిల్లా ఎస్‌పీ రూపేష్ ఆదేశాల మేరకు జహీరా బాద్ డిఎస్పి రామ్మోహన్ రెడ్డి పోలీస్ అధికారులకు అప్రమత్తం చేశారు. వెంటనే పోలీసులు రోడ్లపైకి వచ్చి వాహనాల తనిఖీలు నిర్వహించారు.