12-04-2025 12:57:09 AM
పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఖమ్మం, ఏప్రిల్ 11 (విజయక్రాంతి):-సెక్టార్ ఆఫీసర్లకు అప్పగించిన భాధ్యతలు సక్ర మంగా నిర్వహించాలని తద్వారా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా వుండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సెక్టార్ పోలీస్ అధికారులకు ఆదేశించారు.శుక్రవారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరి ధిలో వున్న సెక్టార్ ఇంచార్జి పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ హనుమాన్ జయంతి ర్యాలీ ప్రశాం త వాతావరణంలో జరిగేలా సెక్టార్ పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా కృషి చేయాలన్నారు.
అదేవిధంగా ఆన్లైన్ బెట్టింగ్, మోసాలు , లోన్ యాప్ కార్యకలాపాలపై పూర్తిగా ని ఘాను పెంచాలని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం స్దానికులకు అవగాహన క ల్పించాలన్నారు.కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్ పాల్గొన్నారు.