calender_icon.png 28 November, 2024 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టు ప్రాంతాల్లో ఉండే పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలి

28-08-2024 03:53:41 PM

పోలీస్ కమిషనర్ శ్రీనివాస్

మంచిర్యాల, (విజయక్రాంతి): మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ లో గురువారం పోలీసులకు టాక్టీస్, ఫీల్డ్ క్రాఫ్ట్, మ్యాపింగ్ పై శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, వారి కదలికలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మావోయిస్టు సరిహద్దు ప్రాంతాల్లో వారు ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడకుండా వారిని నివారించాలన్నారు.

ఫిజికల్ ఫిట్‌నెస్, ఆయుధ వినియోగం, అంబుష్, వెహికల్ అంబుష్, టాక్టికల్ మూమెంట్, పోలీస్ స్టేషన్ పరిధిలో ని ప్రాంతం మ్యాప్ పై పూర్తి అవగాహనా కలిగి ఉండాలని, అవసరాన్ని బట్టి అనుసరించాల్సిన టాక్టికల్ ఆపరేషన్స్ వ్యూహం లో మెళకువలతో పరిస్థితులకు అనుగుణంగా ఎలా వ్యవహరించాలో సూచించారు. ఈ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సురేంద్ర, ఆర్ఐ ఆపరేషన్స్ శ్రీనివాస్, ఆర్ఐ అడ్మిన్ దామోదర్, ఆర్ఎస్ఐలు ప్రవీణ్ వెంకటేష్, అనిల్, హెడ్ కానిస్టేబుల్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.