- నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ బదిలీ
- బెటాలియన్ కమాండెంట్ రోహిణి ప్రియాదర్శి
కామారెడ్డి,అక్టోబర్18(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన కల్మేశ్వర్ సింగేనేవార్, డిచ్‌పల్లిలోని ఏడో బెటాలియన్ కమాండెంట్‌గా పనిచేసిన రోహిణి ప్రియాదర్శినిలు కేంద్ర సర్వీస్‌లకు డిప్యూటేషన్‌పై శుక్రవారం పంపు తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిం ది.
2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కల్మేశ్వర్ అతని భార్య రోహిణి ప్రియాదర్శినిలు కేంద్ర సర్వీస్‌లోకి వెళ్లేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ఇద్దరు దరఖాస్తు చేశారు. వీరిని బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సర్దార్ వల్లబాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడెమీ అసిస్టెంట్ డైరెక్టర్లుగా దంపతులిద్దరిని నియమించారు.
నిజామాబాద్ కమిష నర్‌గా, ఏడవ బెటాలియన్ కమాండెంట్‌గా వీరి స్థానంలో ఇంకా ఎవరినీ ప్రభుత్వం నియమించలేదు. సీపీగా బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత కల్మేశ్వర్ బదిలీ అయ్యా రు.13 అక్టోబర్ 2023న అప్పటి సీపీ సత్యనారాయణ బదిలీ కాగా ఆయన స్థానంలో కల్మేశ్వర్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించి తనదైన మార్క్‌ను పదర్శించారు.